సినిమా థ్రిల్లర్ మరిపించిన ప్లాన్...

రియో డి జనేరో: ఓ బ్రజిల్ గాంగ్ లీడర్, తనని చూడటానికి వచ్చిన కూతురు వేషంలో ఆదివారం గెర్సినో జైలు నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించాడు. జైలు అధికారులు అందించిన వివరాల ప్రకారం, క్లావినో డ సిల్వా అనే గాంగ్ లీడర్ కి 19 ఏళ్ల కూతురు ఉంది. ఆదివారం జైలులో తండ్రిని కలుసుకోవటానికి వచ్చింది. ఆమె లాగా తయారైన ఆ గాంగ్ లీడర్, జైలు బయట గోడ వరకు వచ్చేశాడు. కానీ, చివరలో భయాందోళనలవల్ల పట్టుబడ్డాడు. 

తన తన  19 ఏళ్ల కూతుర్ని జైలులో వదిలి వెళ్ళేటట్టు  ప్లాన్ వేసినట్లు జైలు అధికారులు చెప్పారు.  తండ్రి గెర్సినో జౌలునుండి తప్పించుకునే ప్రయత్నంలో కూతురు పాత్ర ఎంత? అనే విషయం కూడా ధర్యాప్తు చేస్తునామన్నారు. 

 డ సిల్వా  ఒక సిలికాన్ ముసుగు. నల్లటి పొడవాటి జుట్టుతో ఉన్న విగ్గు, బిగుతుగా ఉన్న జీన్స్ పైన పింక్ షర్ట్  ధరించి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న ఫోటోలు రియో జైళ్ల మంత్రిత్వశాఖ విడుదల చేసింది. ఈ ఉదంతంతో ఆయనను మరింత రక్షణ ఉన్న జైలుకు మార్చి, కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు.