భారత అహంకారంతో  ప్రాంతీయ యుద్ధం - ఇమ్రాన్ ఖాన్ ఉప్పు 
ఒమర్, మెహబూబా ముఫ్తి గృహ నిర్బంధం!
35ఏ, 370 రద్దు...?

శ్రీనగర్: కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అభ్దుల్లా,మెహబూబా ముఫ్తిలనుల ఆదివారం గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. 144 సెక్షన్ కింద కాశ్మీర్ లోయ అంతటా ఆంక్షలు విధించారు. కాంగ్రెస్ లీడర్ ఉస్మాన్ మాజీద్, సి‌పి‌ఐ(ఎం) ఎం‌ఎల్‌ఏ తరిగామి కూడా అరెస్టు అయ్యమని అన్నారు. పీపుల్స్ కాన్ఫరెన్స్ నాయకుడు సజ్జద్ లోనేను కూడా అరెస్టు చేశారు. 

లోయలో అన్నీ స్కూళ్ళు. కాలజీలకు సెలవు ప్రకటించారు. ఫోన్, ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేశారు.  ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారు.  
ఒమర్ అబ్దుల్లా  కాశ్మీర్ ప్రజలనుద్దేశించి ఒక ట్వీట్లో చేశారు. అందులో...  ఏమి జరుగబోతుందో మనకు తెలియదు, అల్లా అనుజ్ణ ప్రకారం అంతా మంచే జరుగుతుందనుకుంటున్నాను. ఇప్పుడు మనం  గ్రహించలేక పోవచ్చు. కానీ ఆయన విధానాలు మాత్రం మనం శంకించరాదు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ, అందరినీ జాగ్రత్తగా, ప్రశాంతంగా ఉండమని కోరారు.

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాను మాట్లాడుతూ భారత్ అవలంబిస్తున్న ఇలాంటి 
అహంకారపూరిత ధోరణి వల్ల ప్రతీయ యుద్ధాలు రావోచ్చని హెచ్చరించారు. 

ప్రభుత్వ తీసుకుంటున్న చర్యలు,  జమ్ము కాశ్మీరుకు స్వతంత్ర ప్రతిపత్తి కలిపించే రాజ్యాంగం 35ఏ, 370 అధికారణాలను రద్దు చేయవచ్చని వస్తున్న వార్తలకు బలం చేకూరుస్తున్నాయి.