సోషల్ మీడియాలో హనీ మూన్ ఫోటోలు ...

ముంబయి: బాలీవుడ్‌ నటి రాఖీ సావంత్‌ ఇంతకాలం దాస్తూ వచ్చిన తన పెళ్లి రహస్యం బయట పెట్టింది. ఎన్నారైను వివాహం చేసుకున్నట్లు తెలిపారు. ఈ హాట్ భామ ఇటీవల ఓ హోటల్‌లో పెళ్లి కుమార్తె వేషంలో కనిపించారు. దీంతో రహస్యంగా వివాహం జరిగిందంటూ ప్రచారం జరిగింది. అయితే హోటల్‌లో కేవలం బ్రైడల్‌ ఫొటోషూట్‌ అయ్యిందంటూ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఆ తర్వాత వరుసగా నుదుటిపై కుంకుమ, మెడలో మాంగళ్యంతో ఉన్న ఫొటోల్ని పోస్ట్‌ చేస్తూ వచ్చారు. ఆమె పెళ్లి మీద అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. చివరకు ఆమె హనీమూన్‌ ఫొటోలు వైరల్‌గా మారాయి.

ఈ నేపథ్యంలో రాఖీ తన పెళ్లిపై స్పష్టత ఇచ్చారు. ‘నాకు చాలా భయమేసింది, యూకే ఎన్‌ఆర్‌ఐని పెళ్లిచేసుకున్నా ఆయన పేరు రితేష్. ఆయన పెళ్లి తర్వాత యూకే వెళ్లిపోయారు.  వీసా రాగానే నేనూ వెళ్తా..  టీవీ షోలను నిర్మించాలనే నా కల  ఇక తీరబోతోంది. ఇంత మంచి భర్తను ఇచ్చినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నానంది.