నిన్న స్నేహితుల దినోత్సవం కావడంతో బిగ్ బాస్ షోలో ఎంతో ఉల్లాసభరితమైన వాతావరణం నెలకుంది. సభ్యులనఁదరూ చాలా ఉషారుగా ఒకరినొకరు అభినందించుకుంటూ కనిపించారు ఆదివారం స్నేహితుల దినోత్సవం కావటంతో రాగద్వేషాలు మర్చిపోయి ఫ్రెండ్‌షిప్‌ బ్యాండ్స్‌ కట్టుకుంటూ డాన్సులు చేశారు. ఇస్మార్ట్‌ శంకర్‌ యూనిట్‌ హౌస్‌లో అడుగుపెట్టడంతో సంతోషాల సరదాలు మరింత జోరయ్యాయి. తీరా జాఫర్‌ ఎలిమినేట్‌ కావటంతో వీటన్నింటికి కాస్త బ్రేక్‌ను ఇచ్చినట్టయింది. జాఫర్‌ ఎలిమినేషన్‌తో ఇంటి సభ్యులు అందరూ విచారం వ్యక్తం చేయగా శ్రీముఖి, బాబా భాస్కర్‌లు కన్నీళ్లు ఆపుకోలేకపోయారు.బిగ్ బాస్ - హ్యాపీ విషెస్ :