ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య విధానం, నానాటికి దిగజారిపోతోంది. రాష్ట్ర రాజధాని గుంటూరులో జిల్లా వైద్యాధికారుల నిర్లక్ష్యంతో గ్రామీణ ప్రాంత రోగులు మందులు అందక అవస్థలు పడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రుల్లో కొనుగోలు చేస్తున్నారు. ఆర్థికంగా నష్టపోతున్నారు. అయితే ప్రభుత్వం మందులు కొనుగోలుకు నిధులు మంజూరు చేసినా, వైద్యాధికారులు మందులు కొనుగోలు చేయకుండా మిన్నుకుండిపోవటంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.