ఆర్టికల్ 35ఏ, 370 రద్దు...
అసెంబ్లితో కూడిన కేంద్రపాలిత ప్రాంతం...
లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతం...


 జమ్ము కశ్మీర్‌ ముఖచిత్రాన్ని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం సమూలంగా మార్చివేసింది. ఆర్టికల్‌ 35ఏ, 370 రద్దును ప్రతిపాదిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సోమవారం రాజ్యసభలో ప్రకటన చేస్తూ పలు వివరాలు వెల్లడించారు. జమ్ముకశ్మీర్‌ నుంచి లడఖ్‌లను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించారు. లడఖ్‌ చట్టసభ లేని కేంద్ర పాలిత ప్రాంతంగా కొనసాగుతుందని స్పష్టం చేశారు.లడఖ్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని ప్రజలు కోరుతున్నారని అమిత్‌ షా చెప్పారు. కేంద్రం నిర్ణయంతో కాశ్మీర్  స్వయం ప్రతిపత్తిని కోల్పోయింది.
ఆర్టికల్ 370, కేంద్ర ప్రభుత్వం అధికారాలు రక్షణ, విదేశాంగ విధానం మరియు ప్రసారాల వరకే పరిమితం చేసింది. ఈ ఆర్టికల్ రద్దుతో జమ్ము కాశ్మీర్ రాష్ట్రం తనకున్న ప్రత్యేకతను కోల్పోయింది. మిగతా అన్నీ రాష్ట్రాల లాగానే ఇప్పుడు ఈ రాష్ట్రం కూడా వ్యవహరించవలసి ఉంటుంది. 

1949లో అప్పటి జే&కే ప్రధాన నాయకుడు షేక్ అబ్దుల్లా అప్పటి ప్రధాని నెహ్రూ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఆర్టికల్ 35ఏ చేర్చబడింది. దీని ప్రకారం, జమ్ము కాశ్మీర్ లో స్థిరనివాసమేర్పరచుకున్నవారు తప్ప వేరే వారు ఎవరూ అక్కడి స్తిరాస్తులు కొనుగోలు చేయటానికి అనర్హులు.
ఇకనుంచి జే&కే పౌరులు కూడా మిగతా పౌరులు లాగానే పరిగణించబడతారు. 
     ఈ ఆర్టికల్ మీద సుప్రీం కోర్టులు వాజ్యం నడుస్తోంది. ఇప్పటివరకు పార్లమెంటు ముందుకు రాకుండా 1954లో కేవలం రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ఏర్పడిన చట్టమైనందువల్ల, అది చెల్లదని వాదనలు జరుగుతున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ అదనపు బలగాలను తరలించింది.