తెలంగాణా రాష్ట్రంలో కొద్దిరోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో  సాగుతున్నకాంట్రాక్టు  నర్సుల సమ్మె ఇంకా ఒక కొలిక్కి రాలేదు. వైద్య మంత్రి స్పందించినా  హామీ అమలు కాలేదు. దీనివలన రోగులు ఎన్నో ఇబ్బందులు పడ్తున్నారు. నిమ్స్‌ ఆసుపత్రిలో కాంట్రాక్ట్‌ పద్దతిన విధులు నిర్వహిస్తున్న 370 మంది స్టాప్‌ నర్సులు శాలరీ పేరుతో తమకు వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం ఉదయం విధులను బహిష్కరించారు. రెండు రోజుల క్రితం నిమ్స్‌కు వచ్చిన మంత్రి ఈటలను కలిసిన వారు తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. దీనిపై మంత్రి స్పందిస్తూ తక్షణమే సమస్యను పరిష్కరించాలని ఆ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శాంతకుమారికి సూచించారు. దీంతో ఆమె నర్సులతో సమావేశమైనా వేతనాల విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వలేదు.