ఇప్పటికే అభిప్రాయం భేదాలతో ఉన్న కోహ్లీ ,రోహిత్ శర్మలకు మరింత దూరం పెరిగే సంఘటనలు జరుగుతున్నాయి .టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ మరో నయా రికార్డును నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20ల్లో యాభైకి పైగాస్కోర్లను అత్యధికంగా సాధించిన జాబితాలో టాప్‌ ప్లేస్‌కి చేరారు. ఈ క్రమంలోనే విరాట్‌ కోహ్లి రికార్డును రోహిత్‌ బ్రేక్‌ చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో కోహ్లి 20 సార్లు యాభైకి పైగా స్కోర్లను సాధించగా, రోహిత్‌ దాన్ని సవరించాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా విండీస్‌తో జరిగిన టీ20లో రోహిత్‌ 67 పరుగులు నమోదు చేశాడు. దాంతో తన అంతర్జాతీయ కెరీర్‌లో 21వ సారి యాభైకి పైగా స్కోరును సాధించాడు. ఫలితంగా కోహ్లిని వెనక్కినెట్టేసి అగ్రస్థానాన్ని చేజిక్కించుకున్నాడు