హైదరాబాద్: శ్రావణ మాసం కావడంతో తెలంగాణా వ్యాప్తంగా అమ్మవార్లకు భక్తిశ్రద్ధలతో భక్తులు బోనాలు సమర్పించుకుంటున్నారు. మహిళలు బారులు తీరి బోనాలు సమర్పిస్తుండగా, శివసత్తులు,పోతరాజులుమరియు తొట్టెల ఊరేగింపులతో తెలంగాణా అంత సందడి నెలకొంది. పైగా నిన్న నాగ పంచమి,ఈరోజు గరుడ పంచమి కావడంతో అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.