అమరావతి: పోలవరం ప్రాజెక్ట్‌ పనులను నిలిపివేశామని టీడీపీ అసత్య ప్రచారాన్ని నీటి పారుదల శాఖమంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఖండించారు. శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కూడా పోలవరంపై పూర్తి స్పష్టత ఇచ్చారని ఆయన తెలిపారు. పోలవరం ఒక్కటే కాదని, నిబంధనలకు విరుద్దంగా అంచనాలు పెంచి ఖరారు చేసిన ప్రతి ప్రాజెక్టుకు రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తామని మంత్రి పేర్కొన్నారు.