చండీగఢ్:  మహిళను వేధిస్తున్న వ్యక్తిని వారించాడనే ఆగ్రహంతో పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ సెక్యూరిటీ కమాండోను ఓ యువకుడు కాల్చిచంపిన ఘటన మొహాలీలో వెలుగుచూసింది. క్లబ్‌లో మహిళను అసభ్యంగా తాకుతూ వెకిలిచేష్టలకు పాల్పడిన నిందితుడు చరణ్‌జిత్‌ సింగ్‌ను పంజాబ్‌ పోలీస్‌ 4వ కమాండో బెటాలియన్‌కు చెందిన సుఖ్వీందర్‌ కుమార్‌ వారించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో నిందితుడు చరణ్‌జిత్‌ సింగ్‌తో పాటు అతని స్నేహితులను నిర్వాహకులు బయటకు పంపారు. చరణ్‌జిత్‌ బాధితుడిపై తన గన్‌తో కాల్పులు జరిపి పరారయ్యాడు. బుల్లెట్‌ గాయాలతో సుఖ్వీందర్‌ మరణించారు.