ఆర్టికల్ 370, కశ్మీర్ విభజన బిల్లులపై టీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందించారు. జమ్ముకశ్మీర్ పునర్వ్యవస్థికరణ చట్టంలో మార్పులు చోటుచేసుకున్న ఈ సమయంలో తన ప్రార్థనలు కశ్మీరీల వెన్నంటే ఉంటాయని ఆమె పేర్కొన్నారు. అక్కడి వారంతా ఇక సురక్షితంగా ఉంటారని.. అతి త్వరలో శాంతి నెలకొంటుందని విశ్వసిస్తున్నట్టు ఆమె ట్వీట్ చేశారు.