రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టటం తాత్కాలికమే...

భారత దేశాన్ని దీర్ఘకాలంగా వేధిస్తున్న కాశ్మీర్ సమస్య కొంతమేర కుదుటపడ్డట్లేనని భావించ వచ్చు. ఆర్టికల్ 370 ని రద్దుచేయడం, ఆర్టికల్35ఏ ని సవరించడం ద్వారా మనకు కాశ్మీర్ భారతదేశంలో, మిగతా రాష్ట్రాల లాగా పూర్తిగా కలవడానికి దారి సుగమమైయ్యింది. ఆర్టికల్ 370 రద్దుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టడం తాత్కాలికమేనని, పరిస్థితులు అనుకూలిస్తే జమ్ముకశ్మీర్ మళ్లీ రాష్ట్రం అవుతుందని పేర్కొన్నారు. జమ్ముకశ్మీర్, లడఖ్‌లను ఎప్పటికీ కేంద్ర పాలిత ప్రాంతాలుగానే ఉంచాలని తాము అనుకోవడం లేదని పేర్కొన్న షా.. ఇది తాత్కాలిక ఏర్పాటు మాత్రమేనని స్పష్టం చేశారు. పరిస్థితులు మెరుగుపడితే ఏదో ఒక రోజు జమ్ము కశ్మీర్ మళ్లీ రాష్ట్రం అవుతుందని షా పునరుద్ఘాటించారు.
.