త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కూడా...

 మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఎన్టీయార్ ఓ సినిమా చేయబోతున్నాడట. యంగ్ టైగర్ ఎన్టీయార్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న `ఆర్ఆర్ఆర్` సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.  అత్యంత భారీ బడ్జెట్‌తో అతిపెద్ద మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీయార్‌తోపాటు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా నటిస్తున్నాడు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
 
ఈ సినిమా తర్వాత ఎన్టీయార్ చేయబోయే సినిమాలపై అప్పుడే వార్తలు మొదలయ్యాయి. `అరవింద సమేత` సమయంలోనే ఈ ఇద్దరూ మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నారు. `ఆర్ఆర్ఆర్` తర్వాత ఈ సినిమా పట్టాలెక్కబోతోందట. ఇక, ఈ సినిమా తర్వాత `కేజీఎఫ్` దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి పని చేయడానికి ఎన్టీయార్ అంగీకరించాడట. ఈ రెండు సినిమాల్లో ఒకదానిని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతోంది.