యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్‌ థ్రిల్లర్‌ సాహో. అంతర్జాతీయ స్థాయి యాక్షన్‌ ఎపిసోడ్స్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లోనూ ఒకేసారి రిలీజ్‌ అవుతున్న ఈ సినిమాకు రిలీజ్‌ డేట్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. అన్ని భాషల్లో ఒకే డేట్‌లో రిలీజ్ చేయాలంటే ఇతర చిత్రాలతో పోటి పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అన్ని భాషల్లోనూ నిర్మాతలు సాహో రిలీజ్‌కు లైన్‌ క్లియర్‌ చేశారు. ఆగస్టు 30న రిలీజ్ కావాల్సిన తమ సినిమాలను వాయిదా వేసుకున్నారు
.