రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించడంలో భాగంగా గతేడాది నుంచి సన్నబియ్యం సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో ఈ బియ్యం దారిమళ్లుతున్నట్టు అధికారులు గుర్తించారు. దీంతో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ సన్నబియ్యం వినియోగంలో అక్రమాలను అరికట్టేందుకు నూతన విధానాన్ని అమల్లోకి తెచ్చారు. ఆయా ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు లేదా, వార్డెన్, డిప్యూటీ వార్డెన్లు బియ్యం సరఫరా ఆవుతున్న ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ వద్ద వేలిముద్ర వేస్తేనే 
సన్నబియ్యం విడుదలయ్యేలా నేషనల్‌ ఇన్‌ఫర్‌మేటిక్‌ సెంటర్‌ వెబ్‌సైట్‌ అభివృద్ధి చేసింది. ఆగస్టు1 నుంచి ఈ విధానం రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకు వచ్చింది.