రిలియన్స్ ఇండస్ట్రీస్ యునైటెడ్ కింగ్ డమ్ కి చెందిన బి‌పితో కలసి ఒక కొత్త జాయింట్  వెంచర్ కంపెనీ ఏర్పాటు చేయబోతున్నాయి. ఆ కొత్త కంపెనీ రిటైల్ సర్వీస్ స్టేషన్లు ఇంకా విమానాలకు ఇంధనం సరఫరా చేస్తాయి. కంపెనీ విడుదల చేసిన వివరాలని బట్టి, కొత్త కంపెనీ రిలియన్స్ సంబంధించిన 1400 రిటైల్ దుకాణాల నెట్వర్క్, విమాన ఇంధన సరఫరా కేంద్రాలని ఉపయోగిస్తారని తెలుస్తోంది. 
కొత్త వెంచర్ రాబోయే 5 ఏళ్లలో  5,500 పెట్రోలు పంపులు ఏర్పాటు చేయటానికి సన్నాహాలు చేస్తోంది. వేగంగా విస్తరిస్తున్న మార్కెట్ అందిపుచ్చుకోవాటానికి ప్రయత్నిస్తున్నట్టు కంపెనీ ప్రకటనలో పేర్కొంది.