బి‌జే‌పి సీనియర్ నేత, మాజీ విదేశాంగ మంత్రి శ్రీమతి సుష్మా స్వరాజ్ కన్నుమూశారు. ఆమెకు 67 సంవత్సరాలు. మంగళవారం రాత్రి 10 గంటల 15 నిముషాలకు, గుండె నొప్పితో ఆమెను  ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో చికిత్స కోసం తీసుకెళ్లారు. ఎమర్జెన్సీ వార్డ్ లోనే ఆమె కన్ను మూశారు. సుష్మా స్వరాజ్ భర్త, కుటుంబ సభ్యులు, డా. హర్ష వర్ధన్, పీయూష్ గోయల్, గడ్కారీ తదితరులు కూడా ఆ సమయంలో ఆసుపత్రిలోనే ఉన్నారు.  2016 లో
ఆమెకు  మూత్ర పిండాల ఆపరేషన్ జరిగింది. ఆరోగ్య కారణాల వల్ల పోయిన లోక్ సభ ఎన్నికలలో ఆమె పోటీ చేయలేదు. 
ఆమె మరణం పట్ల కాంగ్రెస్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేసింది. 
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆమె మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, ఆమె చేసిన  సేవల వల్ల కలకాలం గుర్తుంటారని ట్వీట్ చేశారు.