నల్లగా ఉన్నాడని భర్తను చంపిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్, బరేలీ జిల్లాలో జరిగింది. తెల్లగా ఉన్న ఆ యువతి, భర్త నల్లగా ఉన్నాడని, కాల్చి మరీ చంపింది. సోమవారంనాడు ఈ కిరాతకం జరిగింది. 

రెండు సంవత్సరాల క్రితం. ప్రేమ్ శ్రీకి, సత్యవీర్ సింగ్ కి వివాహం జరిగింది. వారికి 6 నెలల పాప కూడా ఉంది. వాడిన ప్రేమ్ శ్రీ ఎప్పుడు అన్నయ్య నలుపు రంగువల్ల సాధిస్తూ ఉండేదని, కానీ ఇంత దారుణానికి పాల్పడుతుందని అనుకోలేదని, సత్యవీర్ సింగ్ తమ్ముడు హర్వీర్ సింగ్ తెలిపాడు. ఆయన నిదుర పోతుండగా, మంటల్లో కాల్చి చంపిందని సమాచారం. 
కుర్హ్ ఫతేగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఇనస్పెక్టర్ సహదేవ్ సింగ్ అందించిన వివరాల ప్రకారం, సెక్షన్ 307 కింద కేసు నమోదు చేశామన్నారు. ఈ ఘటనలో నిందితురాలి కాళ్ళకు కూడా మంటల వల్ల గాయాలయ్యాయి అన్నారు.