ప్రధాని నివాళులు....

 

 కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ పార్థివదేహానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నివాళులర్పించారు. ఆయన ఈ ఉదయం సుష్మ నివాసానికి చేరుకుని ఆమె భౌతికకాయానికి అంజలి ఘటించారు. ఆమె భర్త కౌశల్‌ స్వరాజ్‌, కుమార్తెను ఓదార్చారు.ఈ సందర్భంలో మోదీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. సుష్మ భర్తను పరామర్శిస్తుండగా ఆయన కళ్లు చెమర్చాయి. ఉబికి వస్తున్న బాధను అదిమిపడుతూ గంభీరంగా ఉండేందుకు ప్రయత్నించినా, ఆయన కంటి వెంట నీరు ఆగలేదు.