జమ్ము కాశ్మీర్ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా మారటంపై నవాజ్ షరీఫ్ కూతురు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కారణమంటూ మండి పడ్డారు.  నవాజ్ షరీఫ్ కూతురైన మర్యాం నవాజ్, కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం నెరుపుతానంటూ చేసిన ప్రకటనలు బుద్ధిలేకుండా నమ్మి, ఇండియా ప్రయత్నాలను పసిగట్ట లేకపోయాడంటూ విరుచుకుపడ్డారు. 

ఇమ్రాన్ ఖాన్ భారత వ్యూహాన్ని ఏమాత్రం గుర్తించలేకపోయాడంటూ ఆమె విమర్శించారు. అసాధారణ పరిస్థితులలో అసాధారణ నాయకత్వం అవసరం అంటూ ఆమె వ్యాఖ్యానించారు. 

రేపు కాశ్మీరుకు మద్దతుగా రాజకీయ ర్యాల్లీ చేబతపోతున్నట్టు ఆమె చెప్పారు. 

భారత ప్రభుత్వం ఆర్టికల్ 370 రద్దు చేయటంతో, పాకిస్తాన్ పని కూడితిలో పడ్డ ఏలకాలాగా తయారయ్యింది. దిక్కు తోచని స్థితిలో, అధికార పక్షం ఉంటే, అధికార పక్షాన్ని ఉతికి ఆరేసే పనిలో ప్రతిపక్ష పార్టీలున్నాయి