రామజన్మభూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడానికి పూర్వం మీ అధీనంలో ఉందని చెప్పడానికి మీ వద్ద మౌకిక లేదా పత్ర సంబంధమైన ఆధారాలు, రెవెన్యూ రికార్డులు ఏమైనా ఉన్నాయా? అంటూ  నిర్మోహి అఖారా తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. 1982లో జరిగిన బందిపోటు దాడిలో రామజన్మభూమి యాజమాన్య పత్రాలను తాము కోల్పోయామని, తమ వద్ద ఎలాంటి ఆధారాలు లేవని అఖారా న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు.
రామజన్మభూమి-బాబ్రి మసీదు కేసులో ఆగస్టు ఆరో తేదీ నుంచి ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ధర్మాసనం రోజువారీ వాదనలు వింటున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏర్పాటుచేసిన మధ్యవర్తిత్వ కమిటీ ఓ పరిష్కారం చూపడంలో విఫలమవ్వడంతో ధర్మాసనం రోజువారీ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో వాద, ప్రతివాదులుగా ఉన్న హిందూ-ముస్లిం సంఘాలు ఒక రాజీ పరిష్కారానికి రాకపోవడంతో మధ్యవర్తిత్వ కమిటీ నాలుగు నెలల పాటు జరిపిన సంప్రదింపుల ప్రక్రియ విఫలమైన సంగతి తెలిసిందే.