దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి. రిజర్వ్ బాంక్ రేపో రేట్ నిర్ణయం కూడా మార్కెట్ పతనాన్ని ఆపలేకపోయింది.  మిడ్‌ సెషన్‌ తరువాత 320 పాయింట్లకుపైగా నష్టపోయిన మార్కెట్లు చివరికి నష్టాల్లోనే ముగిసాయి.  ప్రధానంగా  ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ పాలసీ సమీక్ష అనంతరం క్రమంలో   నష్టాల్లోకి జారుకున్నాయి.  సెన్సెక్స్‌ 286  పాయింట్లు క్షీణించి 36,690 వద్ద,  నిఫ్టీ  93 పాయింట్లు నీరసించి 10,856 వద్ద  ముగిసింది. నిఫ్టీ 10900 స్థాయిని కూడా నిఫ్టీ కోల్పోయింది.