రిజర్వ్‌బ్యాంకు  ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) రెపో రేటు నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకు ఎస్‌బీఐ  దీనికనుగుణంగా స్పందించింది. అన్ని రకాల రుణాలపై 15 బేసిస్‌ పాయింట్ల మేర వడ్డీరేటును తగ్గిస్తున్నట్టు వెల్లడించింది.  ఈ సవరించిన ఎంసీఎల్‌ఆర్‌ రేట్లు ఆగస్టు 10నుంచి అమల్లోకి  వస్తాయని బుధవారం తెలిపింది.  దీంతో  ఒక  సంవత్సర కాలపరిమితి కల రుణంపై బ్యాంకు వసూలు చేసే వడ్డీరేటు 8.40 శాతంనుంచి 8.25 శాతానికి దిగి వచ్చింది.    ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో  ఎస్‌బీఐ కూడా  వరుసగా  నాలుగో సారి   ఎంసీఎల్‌ఆర్‌ను కోత పెట్టినట్టయింది.