ఎంత మొత్తుకున్నా తల్లిదండ్రులు కానీ ,ప్రభుత్వాలు కానీ మరియు కళాశాలల యాజమాన్యాలు మారటం లేదు. విద్యార్ధులపై పెట్టుబడులు పెట్టి డబ్బు సేద్యం చేస్తూ వాళ్ళను పశువులుగా మారుస్తున్నారు .తీవ్ర వత్తిడి తట్టుకోలేని విద్యార్థులు చెప్పుకునే దిక్కులేక బలవంతపు మరణాలకు పాల్పడుతున్నారు. చదువు ఒత్తిడి తట్టుకోలేక  మరో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎన్జీవో కాలనీలో  నారాయణ ప్రయివేటు కళాశాలలో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న హర్షవర్థన్‌ అనే విద్యార్థి రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  రిమ్స్‌ సమీపంలోని రైల్వే ట్రాక్‌ సమీపంలో అతడు  శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కళాశాల అధ్యాపకుల వేధింపుల వల్లే తన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తండ్రి జయరాం ఆరోపించారు.