మధుమేహ నియత్రణకు మందు - ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు...               

పళ్లు, కూరగాయలలో ఉండే పిండి పదార్థాలతో ప్రత్యేకంగా రూపొందించిన ఆహారం,  మధుమేహ ముప్పును దూరం చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఔషధ గుణాలున్న ఈ ఆహారం, మన రోగనిరోధక వ్యవస్థను మెరుగు పరుస్తుందని వారు వివరించారు. ఈ పిండిపదార్థాలు జీర్ణాశయంలో అరగకుండా పేగులగుండా వెళతాయని చెప్పారు. పెద్ద పేగులోని బ్యాక్టీరియా ఈ పిండి పదార్థాలను అసిటేట్‌, బ్యూటిరేట్‌గా మారుస్తుందని వివరించారు. ఈ రెండింటి కలయికతో టైప్‌-1 మధుమేహం రాకను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని తెలిపారు. శరీరంలో అణగారిపోయిన జీవక్రియలను ఈ ఆహారం చైతన్య పరుస్తుందని వివరించారు. తాజా ఆవిష్కరణతో ఈ ముప్పును తగ్గించుకోవచ్చని వివరించారు.