:డిల్లీ: కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రాభివృద్ధికి కావాల్సిన,  విభజన చట్టాన్ని అనుసరించి రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశం ఈ భేటీలో చర్చకు వచ్చినట్టు సమాచారం. . ఇక రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం ప్రధాని మోదీని కలిసిన సీఎం జగన్‌, బుధవారం మధ్యాహ్నం కేంద్ర ఉపరితల, రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయాలని వైఎస్‌ జగన్‌ వారి దృష్టికి తీసుకెళ్లారు.