అలస్యానికి కారణం ఏంటి? - పాక్ కోర్ట్ ...

ఇస్లామాబాద్: పాకిస్తాన్ రాజధానిలో పలుచోట్ల భారత దేశానికి మద్దతు తెలుపుతూ, జండాలు వెలిశాయి. భారత ప్రభుత్వం  జమ్ము కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దుకు మద్దతుగా, భారత దేశాన్ని పొగుడుతూ, దాయాది దేశంలో అనేక చోట్ల, చివరకు హై సెక్యూరిటీ రెడ్ జోన్లలో కూడా ఈ పోస్టర్లు,బాన్నర్లు కనుపించాయి.  వెంటనే వాటిని తీసివేసిన అధికారులు, ఈ సందర్భంగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 

ఈ బాన్నర్లు పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, బాంగ్లాదేశ్ కలిపిన అఖండ భారత చిత్ర పటంతో కూడి ఉన్నాయి. అందులో ఈ రోజు జమ్మూ కాశ్మీర్ తీసుకున్నాము, రేపు బలుచిస్తాన్, పి‌ఓ‌కే తీసుకుంటాం, దేశ ప్రధాని అఖండ భారత్ సాధిస్తారని నమ్మకముంది అంటూ శివ సేన నాయకుడు సంజయ్ రావత్ సందేశాన్ని ప్రదర్శించారు. ఆ బానర్లు మంగళవారం దాదాపు ఐదు గంటలు అలాగే ఉండడంతో,   అలస్యానికి కారణం ఏంటి అంటూ ఇస్లామాబాద్, జిల్లా కోర్టు విచారణకు ఆదేశించింది.