ఆర్టికల్ 370 రద్దు విషయం ప్రకటించగానే, అంతర్జాలం అంతా పోస్టులతో నిండి పోయింది. మరుసటి రోజు ప్రధాన మంత్రికి సంబంధించిన ఓ బ్లాక్ అండ్ వైట్ ఫోటో అనేక సంచలనాలకు కారణమయ్యింది.  ఆ ఫోటోలో ప్రధాని 370 ఆర్టికల్ రద్దు కోసం ధర్నా చేస్తున్నట్టుగా ఉంది. ప్రధాన మంత్రి నమ్మింది చేసే వ్యక్తంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. 

ఆర్టికల్ 370 రద్ధు చేస్తూ, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలితా ప్రాంతాలుగా విడకొట్టటం ఒక విప్లవాత్మక చర్య అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఈ 1991కి సంబంధించిన ఈ పాత ఫోటోలు  బి‌జే‌పి జనరల్ సెక్రటరీ రామ్ మాధవ్ తో సహా చాలామంది షేర్ చేశారు. ఆ ఫోటో వెనుక బానర్లో, 370 తీసేయండి, తీవ్రవాదాన్ని తుదముట్టించండి, దేశాన్ని రక్షించండి అంటూ వ్రాసి ఉంది. ఛలో కాశ్మీర్ అని కూడా వ్రాసి ఉన్న ఈ ఫోటో ఇంటర్నెట్ అంతటా వైరల్ అవుతూ ఉంది.