ముంబయి: బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ మనస్తత్వం చాలామంచిదదని సినిమా వర్గాలు చెబుతున్నాయి.
ఆపదలో ఉన్న తన వారికి చేయూత ఇవ్వడంలో ముందుంటారని బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ మరోసారి ప్రూవ్‌ చేసుకున్నారు. ఈ ఏడాది జులైలో గుండెపోటుకు గురైన దబాంగ్‌ సహనటుడు దాది పాండేకు బాసటగా నిలిచిన బాలీవుడ్‌ కండలవీరుడు తన పెద్దమనసు ఏపాటిదో చాటిచెప్పారు. తాను గుండెపోటుతో బాధపడుతూ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందగా తన వైద్య బిల్లులను సల్మాన్‌ ఖాన్‌ చెల్లించారని పాండే వెల్లడించారు.