డిల్లీ: ఆర్టికల్‌ 370 రద్దును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సర్వోన్నత న్యాయస్ధానం నిరాకరించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370ను రద్దు చేస్తూ జారీ చేసిన రాష్ట్రపతి ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ న్యాయవాది ఎంఎల్‌ శర్మ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను గురువారం సుప్రీం కోర్టు తిరస్కరించింది.రాజ్యాంగాన్ని సవరించే అధికారంపై పై  ఐక్యరాజ్యసమితి స్టే ఇస్తుందా అని ప్రీంకోర్టు  ప్రశ్నించింది.రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్ధమని, ప్రభుత్వం ఆర్టికల్‌ సవరణకు పార్లమెంట్‌ ద్వారా పూనుకోవాలన్న పిటిషనర్‌
వాదనను కోర్టు తోసిపుచ్చింది. మరోవైపు కశ్మీర్ లో ఇంటర్నెట్, ఫోన్ సేవల పునరుద్ధరణ కోరుతూ దాఖలైన పిటిషన్ ను సైతం విచారణకు చేపట్టేందుకు కోర్టు నిరాకరించింది. కాగా జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ను మోదీ సర్కార్‌ రద్దు చేసి ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే.