వెబ్ డెస్క్: ఒలింపిక్‌, ప్రపంచ చాంపియన్‌షిప్‌ పతకాలతో భారత బ్యాడ్మింటన్‌ను శిఖరాగ్రానికి తీసుకెళ్లిన ఆగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సింధు మరో అరుదైన ఘనత సాధించింది. ఆటతోపాటు ఆర్జనలోనూ దూసుకెళుతున్న ఈ తెలుమ్మాయి ‘ఫోర్బ్స్‌-2019 మహిళా అథ్లెట్ల’ జాబితాలో భారత్‌ నుంచి అగ్రస్థానంలో నిలిచింది. ఓవరాల్‌గా
13వ స్థానాన్ని దక్కించుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఓ ఏడాదిలో అత్యధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న తొలి 15 మంది మహిళా అథ్లెట్ల జాబితాను ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌ బుధవారం ప్రకటించింది. ఆ జాబితా ప్రకారం సింధు ఏడాదికి
అక్షరాలా రూ. 39 కోట్లు పారితోషికంగా అందుకుంటోంది. సింధు మినహా భారత్‌ నుంచి మరే క్రీడాకారిణికి ఈ ఫోర్బ్స్‌ జాబితాలో చోటు లభించలేదు.