ఆమరావతి: రాష్ట్రంలోని మూడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికలకు ఎన్నికల సంఘం బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నెల 14వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్‌ తెలిపారు. 16న నామినేషన్ల పరిశీలన, 19న ఉపసంహరణకు తుది గడువుగా పేర్కొన్నారు. పోలింగ్‌ నిర్వహించాల్సి వస్తే.. ఆగస్టు 26న నిర్వహిస్తామని, 28తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందన్నారు.