హైదరాబాద్: మడుగులను తలపిస్తూ సర్కారు బడు లు విద్యార్థులకు అవస్థలు తెచ్చిపెడుతున్నాయి. కొద్ది రోజులుగా ఎడతెరపి లేకుం డా కురుస్తున్న వర్షాలతో విద్యార్థులు పాఠశాలలకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని మండల పరిషత్‌ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పై కప్పు నుంచి లీకేజీల కారణంగా తరగతి గదులన్నీ నీళ్లతో నిండిపోయాయి. వరండాలో పొడి ప్రాంతంలో కింద కూర్చొని విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రాంగణం కూడా నీటి ముంపులో ఉంది. విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయడం ఇబ్బందిగా మారింది. భవనం శిథిలావస్థకు చేరడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, భద్రాచలంలోని కస్తూర్బా పాఠశాల ప్రాంగణం వర్షపు నీటితో మడుగులా తయారైంది, దీనికి తోడు పందులు స్వైరవిహారం చేస్తున్నా యి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలలకు మరమ్మతులు చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.