ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఒఫ్  ది బాడీ...

వెబ్ డెస్క్: ముఖారవిందానికి అధిక ప్రాధాన్యతనిచ్చే మహిళలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోవడమే కాకుండా ముఖానికి వికారంగా మొటిమలు పెరిగిపోతున్నాయంటూ స్కిన్‌ స్పెషలిస్టుల దగ్గరికి పరిగెత్తుతున్న మహిళల సంఖ్య కూడా పెరిగిపోవడంతో ఇటీవల డెర్మటాలజిస్టుల సంఖ్య కూడా ఏకంగా 200 శాతానికి పెరిగింది. ముఖాన మొటిమలుగానీ, గాయం లాంటి మడతలుగానీ ఊరికే రావట. శరీరంలోని అంతరావయాల్లో కలిగే మార్పులు లేదా లోపాలను ఎత్తిచూపడం కోసం అవి వస్తాయట. ఈ విషయాన్ని చైనా ఆయుర్వేద వైద్యులు ‘ఫేస్‌ మ్యాపింగ్‌’ ద్వారా ఎప్పుడే తేల్చి చెప్పారు.కళ్లు పసుపు పచ్చగా మారడాన్ని చూసి ‘జాండిస్‌’ జబ్బు ఉన్నట్లు వైద్యులు నిర్ధారిస్తున్న విషయం కూడా మనకు తెల్సిందే. అలాగే కుడి బుగ్గ వద్ద చీలినట్లయితే ఊపిరి తిత్తులకు సంబంధించి ఏదో సమస్య ఉన్నట్లు లెక్కట. అలాగే గుండె గురించి ముక్కు, హార్మోన్ల గురించి గడ్డం చెబుతుందట. చైనా  ఆయుర్వేద వైద్యుల ఈ నమ్మకాలు నిజమేనని న్యూయార్క్‌కు చెందిన డ్యాన్‌ హుసు కూడా నిర్ధారిస్తున్నారు. మన ముఖంలోని ప్రతిభాగం మన శరీరంలోని ఒక్కో అవయవానికి ప్రాతినిథ్యం వహిస్తాయని ఆయన చెప్పారు.