డిల్లీ: అరవింద్‌ కేజ్రీవాల్‌ ఎన్నికల వరాలు కొనసాగుతున్నాయి. తాజాగా ఉచిత ఇంటర్నెట్‌తో ఢిల్లీ వాసులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. దేశ రాజధానిలో 11 వేల ఉచిత వై-ఫై హాట్‌స్పాట్‌లను ఏర్పాటు చేయనున్నట్టు కేజ్రీవాల్‌ప్రకటించారు. హాట్‌స్పాట్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్ల ద్వారా 200 ఎంబీపీఎస్‌ స్పీడ్‌తో ప్రతి నెలా 15 జీబీ డేటాను ఉచితంగా వాడుకోవచ్చని తెలిపారు. ఈ మేరకు గురువారం మంత్రివర్గం నిర్ణయం తీసుకుందని చెప్పారు.