పెనుకొండ ప్లాంట్‌లో కియా మోటార్స్‌ మొట్టమొదటగా తయారు చేసిన సెల్తోస్ మోడల్ కారును గురువారం మంత్రులు రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, శంకర్ నారాయణ, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌ ఆర్కే రోజా మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సందేశాన్ని చదివి వినిపించారు. 13,500 కోట్ల పెట్టుబడులు పెట్టిన దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్‌ సంస్థ ప్రతి ఏటా 3 లక్షల కార్లను తయారీ లక్ష్యంగా పెట్టుకున్నట్టు సంస్థ ప్రతినిధులు తెలిపారు. ప్రతి 6 నెలలకు కొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్టు వెల్లడించారు.