డిల్లీ: రాష్ట్ర పథకాలకు కేంద్రం సహకరించాలని‌ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ను కోరినట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. గురువారం ఢిల్లీలో హర్షవర్ధన్‌తో ఈటల భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ కాకతీయ మెడికల్ కళాశాల, ఆదిలాబాద్ రిమ్స్లో సుపర్ స్పెషాలిటీ బ్లాకులు ఏర్పాటు కానున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌ గాంధీ, నీలోఫర్ హాస్పిటల్స్‌లో ‌సూపర్ స్పెషాలిటీ బ్లాకులు ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరినట్టు వెల్లడించారు. ఖమ్మం, కరీంనగర్ జిల్లాలలో మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయాలని అడిగామన్నారు.