ఇస్లామాబాద్:  కర్ఫ్యూ ఎత్తివేసిన తర్వాత కశ్మీర్‌లో కశ్మీరీల పరిస్థితి ఎలా ఉండబోతుందో ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోందని పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు. జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని
కల్పించేఆర్టికల్‌ 370 రద్దు... ఆ నిర్ణయం తీసుకోవడానికి దారి తీసిన పరిస్థితులను గురించి వివరిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ జాతిని ఉద్దేశించి ప్రసంగించిన విషయం తెలిసిందే. అదే విధంగా కశ్మీర్‌ అఖండ భారత్‌లో సంపూర్ణంగా భాగస్వామి కావడం వల్ల ప్రయోజనాలను ఆయన సుదీర్ఘంగా వివరించారు. మోదీ ప్రసంగంపై పెదవి విరిచిన ఇమ్రాన్‌ ఖాన్‌.. ప్రస్తుత అంశాలపై స్పందించాల్సిందిగా అంతర్జాతీయ సమాజాన్ని మరోసారి కోరారు. ఈ క్రమంలో భారత్‌ వ్యవహరిస్తున్న తీరుపై జోక్యం చేసుకోవాల్సిందిగా పాక్‌ రాయబారి మలీహా లోధి 
ఐక్యరాజ్యసమితికి విఙ్ఞప్తి చేశారు.