దారిద్య్రం నశించి సకల సంపదలతో ,… 
కూకట్ పల్లిలో శ్రీ కామేక్షి సమేత ఏకాంబరేశ్వర ఆలయం - శ్రీ వరలక్ష్మి వ్రతం! 
 

వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని శుక్రవారం కూకట్‌పల్లిలోని కామాక్షి సమేత ఏకాంబేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక్కడ అమ్మవారిని మహాలక్ష్మి అవతారంలో ఆలంకరించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆషాఢమాసంలో బోనాల సందడి ముగియగానే శ్రావణ మాసంలో వరలక్ష్మీ పూజలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో తెలుగింటి ఆడపడుచులు అందరూ అమ్మవారిని పూజిస్తూ సుఖసంతోషాలతో జీవించాలని వరలక్ష్మీ వ్రతం చేస్తుంటారు. శ్రావణ మాసంలో రెండో శుక్రవారం.. అంటే పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం అమ్మవారిని పూజిస్తే అష్టైశ్వర్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తారని భక్తుల నమ్మకం.