కీర్తి సురేష్ మహానటి..., ఉత్తమనటి కూడా...

దిల్లీ: ప్రతిష్టాత్మక 66వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్రం సమాచార, ప్రసారశాఖ శుక్రవారం ప్రకటించింది.  దేశ రాజధాని దిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది. 2018లో దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోని చిత్రాలను పరిగణనలోకి తీసుకుని అవార్డు విజేతలను ప్రకటించారు. అంతకుముందు జ్యూరీ సభ్యులు విజేతల జాబితాను కేంద్రం సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌కు అందజేశారు. దర్శకుడు రాహుల్‌ రాలీ జ్యూరీ సభ్యులతో ఉన్నారు. , సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్‌లో అవార్డులను ప్రకటించి మేలో ప్రదానం చేయాల్సి ఉండగా వాయిదా వేశారు. ఈసారి జాతీయ పురస్కారాల్లో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ‘మహానటి’, ‘రంగస్థలం’, ‘అ!’, ‘చి||ల||సౌ||’ చిత్రాలకు అవార్డులు దక్కాయి. కన్నడ చిత్రం నాతిచరామి అవార్డులలో సింహభాగం దక్కించుకుంది.