హైదరాబాద్‌: తను నిర్మాతగా వ్యవహరించిన ‘అ!’ సినిమాను  జాతీయ అవార్డులు వరించడం పట్ల కథానాయకుడు నాని ఆనందం వ్యక్తం చేశారు. ఆయన సంస్థ,  వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై నిర్మించిన, తొలి సినిమా ఇది. శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 66వ జాతీయ అవార్డుల్లో ఈ చిత్రానికి మేకప్‌, వీఎఫ్‌ఎక్స్‌ విభాగాల్లో అవార్డులు లభించాయి.  ‘అ!’లో కాజల్, నిత్యా మేనన్, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియదర్శి, శ్రీనివాస అవసరాల, మురళీ శర్మ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. నాని, ప్రశాంతి నిర్మించారు. గత ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్‌ అందుకుంది.