టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతమ్‌ గంభీర్‌ పేరిట ఉన్న రికార్డును, యువ క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్ బద్దలు కొట్టాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో అతిపిన్న వయస్సులో డబుల్‌ సెంచరీ సాధించిన భారత క్రికెటర్‌గా ఘనత
సాధించాడు. వెస్టిండీస్‌ ఏతో జరుగుతున్న అనధికారిక టెస్టు మ్యాచ్‌లో శుబ్‌మన్‌ ఈ రికార్డు నెలకొల్పాడు. కాగా 2002లో జింబాబ్వేతో జరిగిన బోర్డు ప్రెసిడెంట్‌ ఎలెవన్‌ టెస్టులో గంభీర్‌ ద్విశతకం సాధించాడు. అప్పుడు
అతడి వయస్సు 20 ఏళ్ల 124 రోజులు. ఇక ట్రినిడాడ్‌లోని బ్రియన్‌ లారా స్టేడియంలో జరగిన మూడో టెస్టులో శుబ్‌మన్‌ 19 ఫోర్లు, రెండు సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో 19 ఏళ్ల 334 రోజుల వయస్సులో టెస్టుల్లో
ద్విశతకం(204) సాధించిన భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.