ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. గత రెండు రోజులుగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉన్నతాధికారులకు, జూనియర్ డాక్టర్లకు మధ్య జరుగుతున్న చర్చలు సఫలమయ్యాయి. జూనియర్ డాక్టర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చిన సమస్యల్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అంగీకరించింది. 13 జిల్లాల జూనియర్ డాక్టర్లు, ప్రతినిధులతో జరిపిన చర్చలు సఫలం కావడంతో జూడాలు సమ్మె విరమించారు.