ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లాలో ఏటూరునాగారంలో వేడుకలు నిర్వహించారు. వై జంక్షన్ నుంచి ఐటీడీఏ వరకు గిరిజన సంప్రదాయ నృత్యాలతో  గిరిజన సంఘాల నేతలు, విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ వేడుకల్లో ములుగు ఎమ్మెల్యే సీతక్క పాల్గొని సందడి చేశారు. ఆమెతోపాటు కలెక్టర్ నారాయణరెడ్డి, ఎస్పీ సంగ్రామసింగ్ పాటిల్, ఐటీడీఏ పీఓ పాల్గొన్నారు.