అమెరికాలోని ఎల్పాసో నగరంలో జరిగిన కాల్పుల వల్ల తల్లితండ్రులను కోల్పోయి అనాధ అయిపోయిన ఒక పాపతో ట్రంప్ దిగిన ఫోటో మీద అనేకమంది ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు. భుదవారం ఆయన భార్యతో కలసి ఎల్పాసో యూనివర్సిటీ మెడికల్ సెంటర్ సందర్శించారు. ఆ సమయంలో పోయిన శనివారం ఎల్పాసో నగరంలో జరిగిన కాల్పుల్లో, తల్లితండ్రులను పోగొట్టుకొని  అనాధ అయిపోయిన ఒక చంటిబిడ్డతో ఆయన భార్యతోకలిసి ఒక ఫోటో దిగారు. ఆ ఫోటో ఇప్పుడు వివాదాస్పదమయ్యింది. ఆ ఫోటోలో ట్రంప్ బొటనవేలు పైకెత్తి నవ్వుతూ ఫోటోకు ఫోజు ఇవ్వడంతో, ఇలాంటి విచారకర సంఘటనల సమయంలో ఆయనా అలా సంతోషంగా కనిపించడం ఏమాత్రం ఉచితంగా లేదని అనేకమంది విమర్శించారు. అయితే ఆ పాప మేనమామ మాత్రం, ట్రంప్ ఆ పాపాకి దేశాన్ని భరోసా ఇచ్చారని, సమర్ధించారు.