ఇటీవల అమెరికాలోని ఎల్పాసో నగరంలో జరిగిన కాల్పుల్లో తమ బిడ్డని రక్షించుకోవటం కోసం ప్రాణాలు కోల్పోయిన తల్లితండ్రుల గాథ అందరి హృదయాలని కలిచివేసింది. జోర్డాన్, ఆండ్రే అంకొండో తమ రెండు నెలల పసివాడిని రక్షించడం కోసం తూటాల వర్షానికి తాము అడ్డుగా నిలబడి, బాబుని రక్షించుకున్నారు. ఆ ఘటనలో బాబు వేళ్ళు విరిగిపోయాయి. పాప ఆరోగ్యంగా ఉందని, కోలుకుంటున్నాడని సమాచారం. అమెరికాలో పెచ్చరిల్లుతున్న తుపాకి సంస్కృతికి, జాతి వెద్వేషాలకి మరోక పసి హృదయం అనాథగా మారింది.