మెక్సికోలో పోలీసులు గుట్టలుగా పోసిన 19 శవాలు  కనుగొన్నారు. అందులో 11 మృతదేహాలు ఒక ఒక రహదారి బ్రిడ్జ్  మాదక ద్రవ్యాల మాఫియా, తమ శత్రు వర్గాలకి హెచ్చరిక జారీచేస్తూ విడుదల చేసిన బ్యానరుతో సహా వెళ్లాడదీసి ఉన్నాయి. కొంచం దూరంలోనే రోడ్డు పక్కన .మిగతా మృతదేహాలు గుట్టగా పోసి కనిపించాయి. మరణించిన వారిలో ఇద్దరు మహిళలునట్టు అక్కడి అటార్నీ జెనరల్ యడ్రియాన్ లోపెజ్ సోలిస్ ఒక న్యూస్ కాన్ఫరెన్స్ లో తెలియచేసారు. మరణించిన వారిలో కొంత మంది పాంటులు విప్పబడి ఉన్నాయి. 

అక్కడ కట్టిన బ్యానర్ లో వైరి వర్గానికి చెందిన వయాగ్రా ముఠాకు, మెక్సికోలో హింసకు మారుపేరైన జలీస్కో డ్రగ్ కార్టెల్ హెచ్చరికలు ఉన్నాయి. కేవలం చంపటమే కాకుండా, శవాలతో పాటుగా వార్నింగులు ఇవ్వటం ద్వారా, శత్రుముఠాలకని , ప్రభుత్వ అధికారులని భయపెట్టడానికని మెక్సికో సెక్యూరిటీ అనలిస్ట్ అలెజండ్రో హోప్ అన్నారు.