హైదరాబాద్: టాలీవుడ్‌లో రెండు ప్రతిష్టాత్మక చిత్రాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన యాక్షన్‌ అడ్వంచరస్‌ థ్రిల్లర్‌ సాహో ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి అక్టోబర్‌ 2న విడుదలకు రెడీ అవుతోంది. తాజాగా ఈ రెండు సినిమాలకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌ టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. సాహో రిలీజ్ తోనే సైరా ప్రమోషన్లలో వేగం పెంచేందుకు ప్లాన్ చేస్తున్నారట నిర్మాతలు. అందుకే సాహో సినిమాతో పాటు సైరా థ్రియేట్రికల్‌ ట్రైలర్‌ను థియేటర్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే టీజర్‌తో ఆకట్టుకున్న సైరా టీం, ట్రైలర్‌ను మరింత ఆసక్తికరంగా రూపొందిస్తున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా అమితాబ్‌ బచ్చన్‌, విజయ్‌ సేతుపతి, జగపతి బాబు, సుధీప్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు