చెన్నై:  ‘పెళ్లయిన వ్యక్తిని ప్రేమించాను. అతడు నన్ను మానసికంగా, శారీరకంగా వేధించాడు అంటూ ఓ మీడియా కార్యక్రంలో తెలిపారు ఆండ్రియా. ఆమె  తెలుగు, తమిళ చిత్రాలలో కేవలం నటిగానే కాక  గాయనిగా కూడా  తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. గత ఏడాది ఆమె నటించిన ‘విశ్వరూపం 2’, ‘వాడా చెన్నై’ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఈ రెండూ చిత్రాల్లో ఆండ్రియా నటనకు ప్రశంసలు దక్కాయి. అయితే దీని తర్వాత ఆమె కోలీవుడ్‌లో కొన్ని నెలలపాటు కనపడలేదు. ఇటీవల ‘బ్రోకెన్‌ వింగ్‌’ అనే పుస్తకాన్ని రాసినట్లు నటి స్వయంగా చెప్పారు. ఈ పుస్తకంలో ఆమె ప్రేమపై తన అభిప్రాయాల్ని తెలిపారు.  తన బాధ వ్యక్తం చేశారు. అయితే ఇంత  ఆవేదన వెనుక కారణం ఏంటని మీడియా ఆమెను ఓ కార్యక్రమంలో ప్రశ్నించింది.

దీనికి ఆండ్రియా స్పందిస్తూ.. ‘పెళ్లయిన వ్యక్తిని ప్రేమించాను. అతడు నన్ను మానసికంగా, శారీరకంగా వేధించాడు. దీన్ని భరించలేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. తిరిగి కోలుకోవడానికి ఆయుర్వేద చికిత్స తీసుకున్నా. ఈ బాధలోనే ‘బ్రోకెన్‌ వింగ్‌‌’ పుస్తకాన్ని రాశా. ఈ సమస్యల నుంచి బయటపడేందుకే సినిమాల నుంచి కాస్త బ్రేక్‌ తీసుకున్నా’ అని చెప్పారు. ఆండ్రియా రెండు రోజుల క్రితం ‘బ్రోకెన్‌ వింగ్‌’ పుస్తకం గురించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ చేశారు.  వ్యక్తిగత విషయాలు, భావాలను అందరితో పంచుకోవడానికి ధైర్యం కావాలని అన్నారు. అభిమానుల కోసం ‘బ్రోకెన్‌ వింగ్‌’ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ పేజీని కూడా ప్రారంభించి, ఈ ఖాతా ద్వారా ఆమె పుస్తకంలోని పద్యాలను షేర్‌ చేస్తున్నారు. బాధ పడుతూ కొర్చోకుండా, ఆవేదననే అవకాశంగా మలుచుకొని, కొత్త జీవితం ప్రారంభిస్తున్న ఆండ్రియాకి అభినందనలు తెలుపుతోంది యునైటెడ్ న్యూస్ భారత్